మోర్తాడ్, బతుకమ్మ: సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను మోర్తాడ్ కస్తూర్బా పాఠశాలలో కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. పీసీసీ అధికార ప్రతినిధి బాస వేణుగోపాల్ యాదవ్, పార్టీ మండల అధ్యక్షుడు ముత్యాల రాములు విద్యార్థినులతో కలిసి కేక్ కట్ చేశారు. హాస్టళ్ల విద్యార్థుల కోసం డైట్, కాస్మొటిక్, మెస్ చార్జీలను పెంచడాన్ని హర్షిస్తూ హాస్టల్ లో సీఎం జన్మదిన వేడుకలు నిర్వహించామన్నారు. అనంతరం విద్యార్థులకు ప్యాడ్స్, పెన్నులు, పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పుప్పాల అశోక్, శివలింగు శ్రీనివాస్, గిర్మాజీ, గంగాధర్, శెట్పల్లి ఆనంద్, గడ్డం అనిల్, గిర్మాజి గోపి, మామిడి శ్రీనివాస్, కుంట శ్రీనివాస్, రాజ్ పాల్, నవీన్, సాయిప్రసాద్, నవీద్ హజార్, అంజద్, రాజేంద్రప్రసాద్, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.
