
జక్రాన్ పల్లి, బతుకమ్మ: విద్యార్థులు తమలోని నైపుణ్యాన్ని పెంపొదించుకోవాలని మోడల్ కళాశాల ప్రిన్సిపాల్ సుధారాణి అన్నారు. వృత్తి విద్య కోర్సులో భాగంగా దసరా సెలవుల్లో ఇంటర్న్ షిప్ లో పాల్గొన్న ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు శుక్రవారం సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. తమ రెగ్యులర్ కోర్సులతోపాటు విద్యార్థుల్లో నైపుణ్యాన్ని పెంచే ఒకేషనల్ కోర్సులైన మల్టీ మీడియా, క్రీడలను జక్రాన్ పల్లి ఆదర్శ కళాశాలలో చాలా విజయవంతంగా కొనసాగిస్తున్నామన్నారు. స్టేట్ కో ఆర్డినేటర్ సురేంద్ర, ఒకేషనల్ ట్రైనర్లు సురేశ్, స్వాతి, కంచరి రవికుమార్ కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు.
