29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

వ్యవస్థలో మార్పు కోసమే మండలి ఎన్నికల్లో పోటీ

Must read

📰 Generate e-Paper Clip

. ఎమెల్సీ అభ్యర్థి మాదానం గంగాధర్

నిజామాబాద్, బతుకమ్మ: వ్యవస్థల్లో మార్పు రావాలని కోరుకుంటూ కూర్చుంటే రాదని, ప్రత్యక్ష ప్రయత్నం ద్వారానే అది సాధ్యమని పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థి మాదానం గంగాధర్ అన్నారు. నగరంలోని ప్రెస్ క్లబ్ లో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుత రాజకీయాల్లో యువత అనివార్యమని, ఇందుకోసమే తాను డీఎస్పీ పదవికి రాజీనామా చేసి ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలుస్తున్నానని అన్నారు. పోలీసు అధికారిగా 26 ఏళ్లపాటు పనిచేసిన అనుభవాన్ని ప్రజా సమస్యల పరిష్కారానికి ఉపయోగిస్తానని అన్నారు. నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో నిలుస్తున్న తనను ఆశీర్వదించాలని కోరారు.

1998లో సర్వీసులోకి..

జిల్లాలోని ఆర్మూర్ కు చెందిన మాదానం గంగాధర్ 1998లో 22 ఏళ్ల వయస్సులో ఎస్సైగా ఉద్యోగం సాధించారు. ప్రమోషన్ లతో డీఎస్పీ స్థాయికి చరారు. ఆయన అందించిన అసాధారణ సేవలను గుర్తించిన ప్రభుత్వాలు కఠిన సేవా పథకం, ఉత్తమ సేవా పథకం, ముఖ్యమంత్రి సర్వోన్నత పథకాలను అందించాయి. ఇప్పటి వరకు ఆయన 200 వరకు రివార్డులు తీసుకున్నారు.

 

More articles

Latest article