వ్యవస్థలో మార్పు కోసమే మండలి ఎన్నికల్లో పోటీ

. ఎమెల్సీ అభ్యర్థి మాదానం గంగాధర్ నిజామాబాద్, బతుకమ్మ: వ్యవస్థల్లో మార్పు రావాలని కోరుకుంటూ కూర్చుంటే రాదని, ప్రత్యక్ష ప్రయత్నం ద్వారానే అది సాధ్యమని పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థి మాదానం గంగాధర్ అన్నారు. నగరంలోని ప్రెస్ క్లబ్ లో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుత రాజకీయాల్లో యువత అనివార్యమని, ఇందుకోసమే తాను డీఎస్పీ పదవికి రాజీనామా చేసి ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలుస్తున్నానని అన్నారు. పోలీసు అధికారిగా 26 ఏళ్లపాటు పనిచేసిన అనుభవాన్ని ప్రజా సమస్యల పరిష్కారానికి ఉపయోగిస్తానని అన్నారు. నిజామాబాద్,...