24 C
Hyderabad
Sunday, August 2, 2026

పోచారం శ్రీనివాస్ రెడ్డికి సన్మానం

Must read

📰 Generate e-Paper Clip

రుద్రూర్, బతుకమ్మ: అభివృద్ధికి నిధుల మంజూరును హర్షిస్తూ రాష్ర్ట ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డిని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు తోట అరుణ్ కుమార్ ఘనంగా సన్మానించారు. రాణంపల్లి – లింగంపల్లి రోడ్డు పనులకు రూ.50లక్షలు, అక్బర్ నగర్ – లక్ష్మీపూర్ క్యాంపు రోడ్డు పనులక రూ.కోటి, సిద్ధాపూర్ – రాయకూర్ రోడ్డుకు రూ.30లక్షలు మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ నారోజి గంగారాం, రైతు సమన్వయ సమితి మాజీ ఛైర్మన్ తోట సంగయ్య , మాజీ ఎంపీటీసీ బాలరాజు, కొండల్ వాడి శంకర్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article