మాచారెడ్డి, బతుకమ్మ: కామారెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం రూ.20 కోట్లు మంజూరు చేసింది. పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్కను ప్రభుత్వ సలహాదారు మహ్మద్ అలీ షబ్బీర్ మంగళవారం మర్యాద పూర్వకంగా కలిశారు. నియోజకవర్గానికి ప్రత్యేక నిధులు కావాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. స్పందించిన మంత్రి సీతక్క రూ. 20 కోట్ల సీ ఆర్ఆర్ నిధులు మంజూరు చేశారు. అడిగిన వెంటనే కామారెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించిన మంత్రి సీతక్కకు షబ్బీర్ కృతజ్ఞతలు తెలిపారు.
