బతుకమ్మ, మోర్తాడ్: మోర్తాడ్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ను స్థానికంగా ఉన్న కృష్ణవేణి టాలెంట్ స్కూల్ పిల్లలు శనివారం పోలీస్ స్టేషన్ ను సందర్శించారు. పాఠశాల విద్యార్థులు పోలీస్, ఆర్మీ దుస్తులను ధరించి పోలీస్ స్టేషన్ కు వెళ్లి పోలీస్ స్టేషన్లో మార్చి ఫస్ట్ నిర్వహించారు. స్టేషన్లో ఉన్న ఆఫీసులో జైల్ తదితర అన్నిటిని సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల సిబ్బంది కానిస్టేబుల్ లను శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో ఏఎస్ఐ గోపాల్, కానిస్టేబుళ్లు నర్సింగరావు, బాలాజీ, శ్రీనివాస్, డబ్ల్యూ బి సి రమ్య, కృష్ణవేణి టాలెంట్ స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

