24 C
Hyderabad
Sunday, August 2, 2026

ఎస్సీ వర్గీకరణ పోరాటం ఫలించింది

Must read

📰 Generate e-Paper Clip

  • జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

బతుకమ్మ, బిచ్కుంద:  ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఎమ్మార్పీఎస్‌ నాయకులు కార్యకర్తల విజయమని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు తెలిపారు. కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోనీ స్థానిక మార్కెట్ యార్డ్ నందు ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఎస్సీల వర్గీకరణ విజయోత్సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు మాట్లాడుతూ
అనాదిగా సమాజంలో అట్టడుగు స్థాయిలో ఉన్న మాదిగ సామాజిక వర్గాన్ని ఉద్దరించేందుకు మందకృష్ణ మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి ఏర్పాటు చేసి కేవలం మాదిగలకేగాక అనేక పోరాటాలతో దివ్యాంగుల సామాజిక పింఛన్‌, ఆరోగ్యం వంటి ఎన్నో సంక్షేమ పథకాలు సాధించి పెట్టారని తెలిపారు.
అయినా మాదిగలు ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడే ఉన్నారని, వారికి రిజర్వేషన్‌ ఫలాలు దక్కాలంటే వర్గీకరణ ద్వారానే సాధ్యమన్నారు. విద్యతోనే అజ్ఞానాన్ని తొలగించుకుని ఉన్నత స్థానాలు అధిరోహించవచ్చన్నారు. ఆయనను ఆదర్శంగా తీసుకుని విద్యావంతులు కావాలని తెలియజేశారు. వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన వెంటనే దేశంలోనే మొట్టమొదటిసారిగా వర్గీకరణను అమలు చేసి తీరుతామని అసెంబ్లీలో ప్రకటన చేసిన ఒకే ఒక్క మొనగాడు రేవంత్ రెడ్డి. అంటూ ఆయన కొనియాడారు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణలో త్వరలోనే వర్గీకరణ అమలులోకి వస్తుందని ఆయన అన్నారు.

ఎస్సీ ల వర్గీకరణ న్యాయ సమ్మతమే..

జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ శెట్కర్

ఎమ్మార్పీఎస్ విజయోత్సవ సభకు అతిథులుగా హాజరైన జహిరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ శేట్కార్ మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా మాదిగలు చేస్తున్న వర్గీకరణ పోరాటం న్యాయ సమ్మతమైనది అని ఈ పోరాటం వల్ల ఎవరికి అన్యాయం జరగదని తమ వాటాను తాము న్యాయబద్ధంగా కోరుకున్నారని అలాగే ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని శాంతియుతంగా నడిపించారని ఆయన అన్నారు.

The struggle for SC classification was successful

More articles

Latest article