ఎస్సీ వర్గీకరణ పోరాటం ఫలించింది

జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు బతుకమ్మ, బిచ్కుంద:  ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఎమ్మార్పీఎస్‌ నాయకులు కార్యకర్తల విజయమని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు తెలిపారు. కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోనీ స్థానిక మార్కెట్ యార్డ్ నందు ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఎస్సీల వర్గీకరణ విజయోత్సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు మాట్లాడుతూ అనాదిగా సమాజంలో అట్టడుగు స్థాయిలో ఉన్న మాదిగ సామాజిక వర్గాన్ని ఉద్దరించేందుకు మందకృష్ణ మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి...