కామారెడ్డి, బతుకమ్మ: జిల్లా కేంద్రంలోని సిరిసిల్ల రోడ్డులో ధర్మకాంట పక్కన ఉన్నపెట్రోల్ బంక్ లో పెట్రోల్ కు బదులు డీజిల్ పోస్తూ వాహనాలను నాశనం చేస్తున్నారని కస్టమర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారుల తనిఖీలు లేకపోవడంతో ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయంటున్నారు. పెట్రోల్ కు బదులు డీజిల్ పోసి మళ్లీ తీసేస్తామని చెప్పి , గంటల తరబడి పెట్రోల్ బంకులోనే ఉంచుతున్నారని, పెట్రోల్ బంక్ మేనేజర్ ను దీనిపై ప్రశ్నిస్తే నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నాడని అంటున్నారు. అధికారులు స్పందించి కస్టమర్లకు న్యాయం చేయాలని కోరుతున్నారు.
