27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

కామారెడ్డి జిల్లాలో హత్యకు గురైన ధర్మారం యువకుడు

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ:

నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం ధర్మారం ( బి) గ్రామ యువకుడు కామారెడ్డి జిల్లాలో హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన అలస్యంగా శుక్రవారం వెలుగులోకి వచ్చింది. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం లింగంపల్లిలో ధర్మారం గ్రామానికి చెందిన క్రిష్ణ (32) అనే యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు తలపై బండరాళ్లతో మోది హత్య చేశారు. గురువారం ఉదయం వెలుగు చూసింది. ముందుగా సధాశివనగర్ పోలిస్ లు గుర్తు తెలియని వ్యక్తి హత్య కేసుగా నమోదు చేసి ధర్యాప్తు ప్రారంభించగా విచారణలో యువకుడిది ధర్మరాం గ్రామంగా తెలిసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నారు.

 

 

More articles

Latest article