29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

రాష్ట్ర స్థాయి అండర్ 14 జట్టుకు ఇందల్వాయి విద్యార్థిని ఎంపిక

Must read

📰 Generate e-Paper Clip

ఇందల్వాయి, బతుకమ్మ : ఇందల్వాయి మండల కేంద్రంలోని ఇందల్వాయి గ్రామంలో చదువుకుంటున్న విస్లావత్ కుసుమ అనే విద్యార్థిని నిజామాబాద్ జిల్లా జట్టుకు ఎంపిక కావడం జరిగిందని పాఠశాల హెడ్మాస్టర్ లక్ష్మీనాథం తెలిపారు. రాష్ట్రస్థాయిలో జరగబోయే కబడ్డీ పోటీలకు నిజామాబాద్ జిల్లా జట్టు తరఫున క్రీడలో పాల్గొననుందని పేర్కొన్నారు. పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు రాజేశ్వర్ అంకితభావంతో పిల్లలలో క్రీడ స్ఫూర్తిని నింపి రాష్ట్రస్థాయి నుండి జాతీస్థాయి వరకు విద్యార్థుల ప్రతిభను వెలికితీస్తున్నందున పాఠశాల తరఫున అభినందనలు తెలుపుతున్నట్లు తెలిపారు. అనంతరం పాఠశాల సిబ్బంది విస్లావత్ కుసుమను అభినందించారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడలలో అన్ని రంగాలలో పైకి రావాలన్నదే తమ ద్యేయమని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.

More articles

Latest article