__మద్నూర్ మండల గిర్దావర్ శంకర్ వెల్లడి
బతుకమ్మ, మద్నూర్: ప్రతి నెల చివరి రోజున పౌర హక్కుల దినోత్సవం కార్యక్రమం ఒక్కోనేలలో ఒక్కో గ్రామంలో నిర్వహిస్తున్నట్లు మద్నూర్ మండల గిర్దావర్ యం. శంకర్ తెలిపారు. బుధవారం పెద్ద శక్కర్గ గ్రామంలో పౌర హక్కుల దినోత్సవం కార్యక్రమంను రెవెన్యూ, సోషల్ వెల్ఫేర్, పోలీసు డిపార్ట్మెంట్ల ఆద్వర్యంలో నిర్వహించారు.
ఈ సంధర్భంగా మాట్లాడుతూ ఇట్టి కార్యక్రమాన్ని ఎస్సీ, ఎస్టీ ప్రజలు తమ హక్కులను కాపాడుకోవడానికి వినియోగించుకొవాలని అన్నారు. ఇతరుల నుండి ఏవైనా హక్కులకు భంగం కలిగించిన, కుల వివక్ష చూయించిన తక్షణమే ఫిర్యాదు చేయవచ్చు అన్నారు. చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మద్నూర్ మండల గిర్దావర్ యం శంకర్ , సోషల్ వెల్ఫేర్ హాస్టల్ ఆఫీసర్ సందీప్, కానిస్టేబుల్ ఓంకార్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
పౌర హక్కుల దినోత్సవాన్ని వినియోగించు కోవాలి
