అవినీతికి అడ్డాగా నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్
📰 Generate e-Paper Clip
- అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ
బతుకమ్మ, నిజామాబాద్ సిటి : నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అంటేనే అవినీతికి కేరాఫ్ అడ్డాగా మారిందని, తాను గెలిచినప్పటి నుండి ఇదే విషయంపై పలుమార్లు హెచ్చరించడం జరిగిందని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ అన్నారు. శుక్రవారం మున్సిపల్ సూపరింటెండెంట్ ఇంట్లో జరిగిన ఏసీబీ దాడుల్లో 6 కోట్లకు పైగా నగదు, పెద్దమొత్తంలో బంగారు ఆభరణాలు,విలువైన ఆస్తుల దస్తవేజులు దొరకడమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. మున్సిపల్ వివిధ శాఖల్లో అవినీతి తిమింగిలాలు ఇంకా ఉన్నాయని, మునిసిపల్ అవినీతి ప్రక్షాళన ఇంకా జరగాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ అవినీతి పరులైన అధికారులు ఉన్నంత కాలం సామాన్యులకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందని ద్రాక్షల మిగిలిపోతాయాని మునిసిపల్ కమీషనర్ల్ కలెక్టర్ క్రిందిస్తాయి అధికారులపైన శాఖల పైన ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహించుకోవాలని సూచించారు. ప్రజలకు న్యాయభద్ధమైన పాలన అందించాలని అలాగే ఇందూర్ నగర ప్రజల నుండి దోచుకున్న ప్రతి పైసా ఇందూర్ నగర అభివృద్ధికే ఖర్చుపెట్టాలని ఆ సొమ్ముపై ఇందూర్ నగర ప్రజలకే హక్కు ఉంటుందని ఏసీబీ అధికారులు రికవరీ చేసిన అక్రమ ఆస్తులు తిరిగి మునిసిపల్ ఖాతాలో జమచేసి అభివృద్ధికి ఖర్చు చేయాలని డిమాండ్ చేసారు.
You cannot print contents of this website.