24 C
Hyderabad
Sunday, August 2, 2026

శ్రీ భాషిత విద్యార్థులు  చెవిటి, మూగ పాఠశాల సందర్శన

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, ఆర్మూర్ : ఆర్మూర్ లోని శ్రీ భాషిత పాఠశాల కు చెందిన ఏడవ తరగతి విద్యార్థులు ( డెఫ్ & డాంబ్) చెవిటి, మూగ పాఠశాలను సోమవారం రోజు సందర్శించారు. ఈ సందర్శనలో భాగంగా విద్యార్థులు తోటి విద్యార్థులతో గౌరవభావం, స్నేహం, మానవతా విలువలు తెలుసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా విద్యార్థులు ప్రత్యక్షంగా ఒకరి కి ఒకరు చర్చించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ పోలపల్లి సుందర్ మాట్లాడుతూ ఇటువంటి కమ్యూనిటీ రీచ్ కార్యక్రమాలు విద్యార్థులకు మంచి స్పూర్తిని అందిస్తాయి. అంతేకాకుండా సమాజంలో వివిధ ప్రాథమిక అవసరాలపై అవగాహన పెంచుకోవడానికి దోహదపడుతుంది అని చెప్పారు.
అనంతరం విద్యార్థులు వారికి పండ్ల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ భాషిత పాఠశాల కరస్పాండెంట్, ప్రిన్సిపల్, ఉపాధ్యాయునీ, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

Sri Bashita students visit deaf and dumb school

More articles

Latest article