23.3 C
Hyderabad
Saturday, August 1, 2026

నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ మందమకరంద్ బదిలీ

Must read

📰 Generate e-Paper Clip

కొత్త కమిషనర్ గా దిలీప్ కుమార్

నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ మంద మకరంద్ బదిలీ అయ్యారు. సోమవారం రాష్ట్ర ప్రభుత్వం 2020 బ్యాచ్ కి చెందిన 13 మంది ఐఏఎస్ లను బదిలీ చేసింది. అందులో భాగంగా నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ గా పనిచేస్తున్న మంద మకరందను హైదరాబాదులోని సీసీఎల్ఏ కార్యాలయం ప్రాజెక్టు డైరెక్టర్ గా నియమించింది. మందమకరంద్ స్థానంలో మేడ్చల్ జిల్లా పరిషత్ సీఈవో దిలీప్ కుమార్ ను కమిషనర్ గా బదిలీ చేసి నియమించింది. ఏడాది కాలం పైగా పనిచేసిన మందమకరంద్ బల్దియా పై ఇప్పుడిప్పుడే తనదైన ముద్ర వేసుకుంటున్న తరుణంలో బదిలీ చేయడం కొత్త చర్చకు దారి తీసింది. 2020 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన దిలీప్ కుమార్ కొత్త కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించనున్నారు.

More articles

Latest article