30.9 C
Hyderabad
Monday, August 3, 2026

డాక్టర్ బాపురెడ్డి కి రూరల్ ఎమ్మెల్యే నివాళి 

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : అనారోగ్యంతో అకాల మరణం చెందిన ప్రముఖ వైద్యులు, రాజకీయ వేత్త డాక్టర్. బాపురెడ్డి భౌతిక కాయానికి నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్. భూపతి రెడ్డి ఆదివారం నివాళులార్పించారు.  హైద్రాబాద్ లోని కొంపల్లి బాపురెడ్డి నివాసంలో అయన పార్దివ దేహాం పై పూలమాల వేసి నివాళులార్పించారు.ఈ సందర్బంగా భూపతి రెడ్డి మాట్లాడుతూ నిజామాబాద్ లో ప్రముఖ డాక్టర్ గా, రాజకీయవేత్తగా పేరు గాంచిన బాపురెడ్డి నిజామాబాదు ప్రజలకు ఆత్మీయుడని,  తెలంగాణ రాష్ట్ర సాధనలో ముందు ఉండి పోరాడిన గట్టిన తెలంగాణ వాది అన్నారు.పేదలకు డాక్టర్ అయి చికిత్స రూపంలో సహాయం చేసినవారు బాపురెడ్డి అని నాకు అత్యంత సన్నిహితుడు అని అయన అకాల మరణం బాధాకరమన్నారు.వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను అని తెలుపుతూ నివాళులు అర్పించారు.వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

More articles

Latest article