24.7 C
Hyderabad
Monday, August 3, 2026

వారం రోజుల్లో 84 డ్రంకన్ డ్రైవ్ కేసులు

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :

 

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గడిచిన వారం రోజులలో 84 డ్రంకన్ డ్రైవ్ కేసులు నమోదు అయినట్టు పోలీస్ కమీషనర్ పి. సాయి చైతన్య తెలిపారు. నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని సరిహద్దులలో వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నట్టు ఆయనన్నారు. అలాగే ఈ నెల 27 నుంచి 31 వరకు నిర్వహించిన ఈ తనిఖీలలో మొత్తం 84 కేసులు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. వీరినందర్నీ సంబంధిత కోర్టులలో హాజరుపరచగా వీరికి రూ: 7,90,000/- జరిమానా విధించడం జరిగిందన్నారు. ఇందులో ఐదుగురికి వారం రోజుల పాటు జైలు శిక్ష విధించడం జరిగిందని తెలిపారు. ప్రజలు మద్యం సేవించి వాహనాలు నడపరాదని, వాహనాదారులు వాహనానికి సంబంధించినటువంటి పత్రములు సక్రమముగా తమ వద్ద ఉంచుకోవాలని ఆయన కోరారు.

More articles

Latest article