28.2 C
Hyderabad

మధ్యాహ్న భోజనం వికటించి 28 మంది విద్యార్థులకు అస్వస్థత

Must read

📰 Generate e-Paper Clip

బిచ్కుంద, బతుకమ్మ :  కామారెడ్డి జిల్లాలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. బిచ్కుంద మండలం షెట్లూర్ ప్రభుత్వ ప్రైమరీ స్కూల్ లో మధ్యాహ్న భోజనం వికటించింది. 28 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. బిచ్కుంద ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. బాధిత విద్యార్థులను మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే పరామర్శించారు. మధ్యాహ్న భోజనం చేశాక విద్యార్థులకు వాంతులు విరేచనాలు అయ్యాయి. నాణ్యత లేని భోజనమే కారణమని తెలుస్తోంది. నిర్లక్ష్యంగా వంట చేసిన ఏజెన్సీ ని తొలగిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.

More articles

Latest article