29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

108 అంబులెన్సు లో ప్రసవం

Must read

📰 Generate e-Paper Clip

  • మగ బిడ్డకు జన్మనిచ్చిన పొట్టోడి సోనూ
  • 108 సిబ్బందిని అభినందించిన కుటుంబ సభ్యులు

బతుకమ్మ, భీంగల్ : ప్రసవం నొప్పులతో బాధపడుతున్న గర్భిణీ పొట్టోడి సోనూ(26) ను ప్రసవం నిమిత్తం108 అంబులెన్సు లో భీంగల్ హాస్పిటల్ కు తరలిస్తుండగా అంబులెన్సులోనే ప్రసవం అయిన సంఘటన గురువారం చోటుచేసుకొంది.సంఘటన వివరాల్లోకి వెళ్తే ముచ్కూర్ గ్రామానికి చెందిన గర్భిణీ సోనూ నాలుగో కాన్పు కోసం 108 అంబులెన్సు లో భీంగల్ హాస్పిటల్ కు తరలిస్తుండగా పురిటి నొప్పులు ఎక్కవయ్యి అంబులెన్సు లోనే ప్రసవం అయ్యింది. ఈ ప్రసవంలో బాలింత సోనూ మగ బిడ్డకు జన్మనిచ్చింది. అంబులెన్స్ లో సోనుకు సాధారణ ప్రసవం చేసిన 108 సిబ్బంది ఈ. ఎం. టీ సుందర్, పాయిలెట్ రాజ్ కుమార్ లను ఆమె కుటుంబీకులు అభినందించారు.

More articles

Latest article