జడ్పీహెచ్ఎస్ సుంకిని విద్యార్థుల విజ్ఞాన విహార యాత్ర
బతుకమ్మ, పోతంగల్ : మండలం లోని సుంకిని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు విజ్ఞాన విహార యాత్రలో భాగంగా బాసర దేవాలయం, బాసర ఐఐఐటీ, అంకాపూర్ గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులకు పలు విషయాలపై అవగాహన కల్పించారు. మొదటగా బాసర జ్ఞానసరస్వతి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం బాసర ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌ను సందర్శించి, విద్యా విధానం, సాంకేతిక అభివృద్ధి గురించి అవగాహన కల్పించారు. తదనంతరం అంకాపూర్ గ్రామంలోని గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ సాంకేతికత, ఆధునిక వ్యవసాయ పద్ధతుల...