Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 August 2025, 7:19 pm Posted by : ramakrishna

ఘనంగా జహీరాబాద్ ఎంపీ జన్మదిన వేడుకలు

బతుకమ్మ, బిచ్కుంద : కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో జహీరాబాద్ ఎంపీ సురేష్ శేట్కార్ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ సీనియర్ నాయకులు కమల్ కిషోర్ నివాసంలో ఘనంగా నిర్వహించారు. మండలంలోని ముఖ్య కార్యకర్తల మధ్య కోలాహాలంగా కార్యక్రమాన్ని నిర్వహించి కార్యకర్తల ఉత్సవాలు, సంబరాల మధ్య కాంగ్రెస్ సీనియర్ నాయకులు కమల్ కిషోర్ జహీరాబాద్ ఎంపీ సురేష్ శేట్కార్ జన్మదిన వేడుకల కేక్ ను కట్ చేసి కార్యకర్తలకు తినిపించారు. ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్ల పంపిణీ, నిరాశ్రయులైన నిరుపేదలకు కొన్ని రోజులకు సంబంధించిన ఆహార సామాగ్రిని, పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నూతనంగా ఎన్నికైన మున్నూరు కాపు సంఘం బిచ్కుంద అధ్యక్షులు పుల్లెన్ విట్టల్ మాట్లాడుతూ జహీరాబాద్ ఎంపీ సురేష్ శేట్కార్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కార్యకర్తల ఆదరాభిమానాలు నిత్యం పొందాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మైనార్టీ సీనియర్ నాయకులు పాషా సెట్, పుల్లెన్ వెంకట్,మాజీ ఎంపీటీసీ అవార్ సురేష్, పోతుల అనిల్, పోతుల అశోక్, మరియు మున్నూరు కాపు కులస్తులు, మైనారిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Zaheerabad MP's birthday celebrated in grand style