Batukammanews
Newspaper Banner
Date of Publish : 02 September 2025, 7:48 pm Posted by : ramakrishna

కాంగ్రెస్ ఆధ్వర్యంలో వైయస్సార్ వర్ధంతి

బతుకమ్మ, ఏర్గట్ల; మండల కేంద్రం బస్టాండ్ వద్ద కాంగ్రెస్  కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి మహానేత స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి కాంగ్రెస్ కార్యకర్తలు పూలమాలవేసి నివాళులు అర్పించారు, వర్ధంతి నిర్వహించినారు.ఇట్టి సందర్భంలో జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడు శివన్నోళ్ల శివకుమార్ మాట్లాడుతూ స్వర్గీయ మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి,ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి పథకాలను ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆరోగ్య శ్రీ,108 అంబులెన్స్, వ్యవసాయానికి ఉచిత కరెంట్,విద్యార్థులకు ఫీజుల మాపి ఇలా అనేక పథకాలు ప్రజలకు అంది విధంగా యధావిధిగా కొనసాగిస్తుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీతో స్వర్గీయ వైయస్ రాజశేఖర్ రెడ్డి ది విడదీయరాని అనుబంధం అని కొనియాడారు. వైయస్ భౌతికంగా చనిపోయిన ప్రజల మనుసులో చెదరని ముద్ర వేసుకున్న కరుడుగట్టిన కాంగ్రెస్ వాది అని గుర్తు చేసుకొని వైయస్సార్ అమర్ రహే, జోహార్ వైయస్సార్ అని నినాదాలు చేస్తూ నివాళులు అర్పించారు. ఇట్టి కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు శివన్నోళ్ళ శివకుమార్, గడ్డం జీవన్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు రేండ్ల రాజారెడ్డి, పన్నాల నర్సారెడ్డి,బద్దం లింగారెడ్డి,ముస్కు మోహన్ రెడ్డి,ఇంద్రసేనారెడ్డి,కొలిపాక రవి,దండ బోయిన సాయి,మేకల సాయన్న,బద్దం జితేందర్ రెడ్డి,కుమ్మరి సహదేవ్,ఆరపు మాణిక్యం, సురేష్ యాదవ్,ఏర్గట్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.