- జలయజ్ఞం పేరుతో ప్రాజెక్టులు కట్టిన ఘనత వైఎస్సార్ దే
ఎల్లారెడ్డిపేట, బతుకమ్మ: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా చేసినటువంటి మహత్తర కార్యక్రమాలు ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్, రైతు రుణమాఫీ వంటి పథకాల ద్వారా ప్రజల గుండెల్లో ఇప్పటికీ ఆయన బ్రతికే ఉన్నారని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య,జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు షేక్ గౌస్ అన్నారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటాన్ని ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం వారు మాట్లాడుతూ మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఆ మహానేతకు మండలంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగిందన్నారు. జలయజ్ఞం పేరుతో ఎన్నో ప్రాజెక్టులు కట్టిన ఘనత వైయస్ రాజశేఖర్ రెడ్డి దేనని అన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను ప్రవేశపెట్టి ఎంతోమంది నిరుపేద విద్యార్థుల చదువులలో వెలుగులు నింపారని అన్నారు.ఆయన అటువంటి మహానుభావులు ప్రజల మనసులో స్థిరస్థాయిగా నిలిచిపోతారని ఈ సందర్భంగా ఆయన చేసిన మంచి పనులు గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ షేక్ సాబేరా బేగం , వైస్ ప్రెసిడెంట్ గుండాడి రామిరెడ్డి, పట్టణ అధ్యక్షులు చెన్ని బాబు, కాంగ్రెస్ పార్టీ నాయకులు బండారి బాల్ రెడ్డి, కదిరే శ్రీనివాస్ గౌడ్,రవీందర్ గుప్తా, మేండే శ్రీనివాస్ యాదవ్, షకీల్, సూడిది రాజేందర్, మొగుళ్ళ మధు యాదవ్ లు తదితరులు పాల్గొన్నారు.