రుద్రూర్, బతుకమ్మ : ప్రజల గుండెల్లో నిలిచిన మహనీయుడు స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి అని బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఇందూరి చంద్రశేఖర్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోట అరుణ్ కుమార్ లు అన్నారు. మంగళవారం రుద్రూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంగణం వద్ద బ్లాక్ కాంగ్రెస్ పార్టీ, మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా వైయస్ రాజశేఖర్ రెడ్డి 76 వ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి 2004 వ సంవత్సరంలో 1475 కిలోమీటర్లు తిరిగి అధికారం చేపట్టారన్నారు. ప్రజలకు ఉచితంగా 108, 104 అంబులెన్సు సౌకర్యం, రైతులకు రుణమాఫీ, పలు సంక్షేమ పథకాలు అందించారని, ఆయన చేసిన సేవలు మరువలేనివని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు షేక్ నిస్సార్, కర్క అశోక్, పత్తి రాము, తోట సంగయ్య, అక్కపల్లి నాగేందర్, డా.రఫీక్, ఫుర్ఖన్, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.