పార్టీ పదవుల్లో యువతకు పెద్దపీట
యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు విపుల్ గౌడ్ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గెలుపుకు గ్రామ స్థాయి నుండి కృషి చేయాలని, పార్టీ పదవులలో యువతకు పెద్దపీట వేస్తాం అని యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు విపుల్ గౌడ్ అన్నారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మొయిన్ యూసుస్ ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు విపుల్ గౌడ్...