Batukammanews
Newspaper Banner
Date of Publish : 27 June 2025, 7:53 pm Posted by : ramakrishna

పార్టీ పదవుల్లో యువతకు పెద్దపీట

  • యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు విపుల్ గౌడ్

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గెలుపుకు గ్రామ స్థాయి నుండి కృషి చేయాలని, పార్టీ పదవులలో యువతకు పెద్దపీట వేస్తాం అని యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు విపుల్ గౌడ్ అన్నారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మొయిన్ యూసుస్ ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు విపుల్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో యూత్ కాంగ్రెస్ నాయకులకు కూడా ప్రాధాన్యత ఇప్పించే విధంగా కృషి చేస్తామని తెలిపారు. యూత్ కాంగ్రెస్ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం చేసే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కృషి చేయాలి అని అన్నారు. అతి త్వరలో సోషల్ మీడియా కమిటీలను ఏర్పాటు చేస్తామని, వారి ద్వారా సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు బింగి శుభం, నగర ప్రధాన కార్యదర్శి మోసిన్ ఖాన్, నార్త్ మండల అధ్యక్షులు దినేష్ కుమార్,నార్త్ మండల ఉపాధ్యక్షులు దీక్షిత్ కుమార్,రూరల్ మండల అధ్యక్షులు సయీద్ ముద్దశీర్, సర్ఫరాజ్,అక్రం, ఫైజల్ తదితరులు పాల్గొన్నారు.

Youth to play a major role in party positions