షార్ట్ సర్క్యూట్‌తో యువకుడికి తీవ్ర గాయాలు

  ఇందల్వాయి, బతుకమ్మ :   షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ యువకుడు తీవ్రంగా గాయపడిన ఘటన ఇందల్వాయి మండలంలోని సిర్నాపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం, సిర్నాపల్లి గ్రామానికి చెందిన హైమద్ (32) వ్యవసాయ పొలం వద్ద విద్యుత్ మరమ్మతు పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్‌కు గురయ్యాడు. లైన్‌మెన్ అనుమతి లేకుండా కేవలం ట్రాన్స్‌ ఫార్మర్ వద్ద ఉన్న హ్యాండిల్‌ను బంద్ చేసి విద్యుత్ మరమ్మతులు చేపడుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. షార్ట్ సర్క్యూట్‌కు గురైన...