Batukammanews
Newspaper Banner
Date of Publish : 13 August 2026, 4:42 pm Posted by : ramakrishna

షార్ట్ సర్క్యూట్‌తో యువకుడికి తీవ్ర గాయాలు

 

ఇందల్వాయి, బతుకమ్మ :

 

షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ యువకుడు తీవ్రంగా గాయపడిన ఘటన ఇందల్వాయి మండలంలోని సిర్నాపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం, సిర్నాపల్లి గ్రామానికి చెందిన హైమద్ (32) వ్యవసాయ పొలం వద్ద విద్యుత్ మరమ్మతు పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్‌కు గురయ్యాడు. లైన్‌మెన్ అనుమతి లేకుండా కేవలం ట్రాన్స్‌ ఫార్మర్ వద్ద ఉన్న హ్యాండిల్‌ను బంద్ చేసి విద్యుత్ మరమ్మతులు చేపడుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. షార్ట్ సర్క్యూట్‌కు గురైన హైమద్ తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. వెంటనే గమనించిన స్థానికులు 108 అంబులెన్స్‌లో హైమద్‌ను నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై తమకు ఎలాంటి సమాచారం అందలేదని ఇందల్వాయి పోలీసులు తెలిపారు.

 

Youth sustains severe injuries due to short circuit.