Batukammanews
Newspaper Banner
Date of Publish : 25 November 2024, 7:13 pm Posted by : ramakrishna

యువకుడి ఆత్మహత్య

నిజామాబాద్ సిటీ బతుకమ్మ : మద్యానికి బానిసై కుటుంబ స్థితిగతులను పట్టించుకోకుండా కేవలం మద్యానికే పరిమితమవుతూ మద్యానికి పైసలు దొరకకపోతే యాసిడ్ తాగి మృతి చెందిన ఘటన నగరంలో చోటుచేసుకుంది. త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో చోటు చేసుకున్న ఈ ఘటన పోలీసుల వివరాలు ప్రకారం..నిజామాబాద్ నాందేవ్ వాడకి చెందిన మంత్రి రూపేష్ అనే వ్యక్తికి 15 సంవత్సరాల క్రితం వివాహం అవ్వగా, అతను మద్యానికి బానిస అవ్వడంతో అతని భార్య అతనిని వదిలేసింది. అప్పటినుండి రూపేష్ ఇంకా ఎక్కువ మద్యం త్రాగడానికి బానిసయ్యారు. అయితే ఆదివారం  ఉదయం  రూపేష్ తన జీవితం మీద విరక్తి చెంది యాసిడ్ త్రాగాడు. అతని తల్లి  మమత చికిత్స నిమిత్తం రూపేష్ ని ఆసుపత్రికి తరలించగా ఆదివారం రాత్రి మృతి చెందారు. అతని తల్లి మమత ఇచ్చిన ఫిర్యాదు మేరకు త్రీ టౌన్ ఎస్ హెచ్ ఓ మహేష్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.