Batukammanews
Newspaper Banner
Date of Publish : 19 December 2024, 8:38 pm Posted by : ramakrishna

యువకుడి ఆత్మహత్య 

బతుకమ్మ భిక్కనూరు: కడుపునొప్పి భరించలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన భిక్కనూరు మండల జంగంపల్లి గ్రామంలో గురువారం ఉదయం చోటు చేసుకుంది ఎస్ఐ తెలిపిన సమాచారం ప్రకారం జంగంపల్లి గ్రామానికి చెందిన బందెల శివరాజ్ (30) అనే యువకుడు గత కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతూ మానసికంగా కృంగిపోయాడు ఎక్కడ చూపించిన తగ్గకపోవడంతో దీంతో జీవితంపై విరక్తి చెంది ఎవరూ లేని సమయంలో గుడిసెలో ఉదయం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై సాయికుమార్ తెలిపారు.