Batukammanews
Newspaper Banner
Date of Publish : 23 December 2024, 11:35 am Posted by : ramakrishna

జీరాయత్ నగర్ లో యువకుడికి కత్తిపోట్లు

ఆర్మూర్, బతుకమ్మ:

ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని జీరాయత్ నగర్ లో కత్తి పోట్లు కలకలం రేపాయి. అదివారం రాత్రి పేర్కిట్ ప్రాంతానికి చెందిన షేక్ తాహేర్ పై జీరాయత్ నగర్ కు చెందిన జీషాన్, వాజీద్, సమీర్ లు ఘర్షణ పడ్డారు. ఈ ఘర్షణలో తాహేర్ పై కత్తితో పోడవగా తీవ్రంగా గాయపడ్డారు. అతడిని ప్రథమ చికిత్సఆర్మూర్ లో చేయించి  నిజామాబాద్ జిల్లా జనరల్ ఆసుపత్రికి తరలించారు. ఆర్మూర్ పోలిసులు కేసు నమోదు చేసి విచారణ చెపట్టారు.