. . . మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే
బాన్సువాడ, బతుకమ్మ :
భారతదేశ స్వాతంత్రం కోసం ప్రాణాలను కూడా లెక్క చేయకుండా పోరాడి దేశం కోసం ప్రాణాలను అర్పించిన కామ్రేడ్ భగత్ సింగ్ ని, ఆయన పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని ముందుకు పోవాలని మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే అన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలో బీర్కూర్ మండల కేంద్రంలో గల స్థానిక భగత్ సింగ్ చౌరస్తాలో శుక్రవారం భగత్ సింగ్ విగ్రహావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఆయన హాజరై విగ్రహావిష్కరణ చేసి, విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భగత్ సింగ్ ఈ దేశం కోసం పోరాడి అతి చిన్న వయస్సులోనే బ్రిటీషర్లు విధించిన ఉరిశిక్షకు తన ప్రాణాలను అర్పించాడని తెలిపారు. విద్యార్థులు విద్యలో ముందుండాలని, విద్య వల్లనే మన భవిష్యత్ మారుతుందని, ఇంకేవి మన తలరాతను మార్చలేవని వివరించారు. ఈ కార్యక్రమంలో యన్. బాల్ రాజ్, పిడిఎస్యు జిల్లా అధ్యక్షులు, ఏఐఎస్ బి జిల్లా అధ్యక్షులు డి.నాగరాజ్, నాయకులు రాజన్న, మావురం శ్రీకాంత్, ఓయుపిడిఎస్ యు మాజీ నాయకులు సబ్బిడి రమేష్, బీర్కూర్ సర్పంచ్ అరిగే ధర్మతేజ, గ్రామ యువ నాయకులు కుర్రి కృష్ణ, బాలకృష్ణ, కోర్రి శివ కుమార్, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.