Batukammanews
Newspaper Banner
Date of Publish : 15 January 2025, 4:13 pm Posted by : ramakrishna

యువత క్రీడలతోపాటు సమాజ మార్పు కోసం కృషి చేయాలి

  • ఇల్లందు మాజీ ఎమ్మెల్యే , సీపీఐ (ఎం. ఎల్ ) మాస్ లైన్ రాష్ట్ర నాయకులు గుమ్మడినర్సయ్య

సిరికొండ, బతుకమ్మ : యువత క్రిడాలతోపాటు సమాజ మార్పు కోసం కృషి చేయాలని ఇల్లందు మాజీ ఎమ్మెల్యే , సీపీఐ (ఎం.ఎల్ ) మాస్ లైన్ రాష్ట్ర నాయకులు గుమ్మడి నర్సయ్య అన్నారు. బుధవారం సిరికొండ మండలంలోని గడ్కోల్ గ్రామంలో సీపీఐ (ఎం. ఎల్ ) మాస్ లైన్ ఆధ్వర్యంలో, పార్టీ మండల ఆర్.రమేష్ అధ్యక్షతన గడ్కోల్ అమరవీరుల స్మారకార్థం నిర్వహిస్తున్న జిల్లా స్థాయి వాలీబాల్, కబడ్డీ పోటీలను ఆయన ప్రారంభించారు. ఈసందర్బంగా గ్రామంలో గల ఎర్రజెండాను ఎగరవేసి, భగత్ సింగ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు హార్పించి,గ్రామంలో కవాతు నిర్వహించి క్రీడాలను ప్రారంభించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతు యువతను నిర్వీర్యం చేయడానికే మద్యం, పదార్థలను అలవర్చుతు, యువతను నిర్వీర్యం చేయడానికి ప్రభుత్వాలు కుట్ర పన్నుతున్నాయని ఆయన ఆరోపించారు. యువత తమకోసం, తమ కుటుంబం కోసం మాత్రమే ఆలోచించకుండా సమాజం పట్ల బాధ్యతతో ఉద్యమించి మార్పు కోసం పోరాడాలి పిలుపునిచ్చారు . గడ్కోల్ అమరుల కోసం ఈ క్రీడాలు నిర్వహించడం అంటే వారి ఆశయాలు సాధించడం కోసం పోరాడడమే నన్నారు. యువత మద్యం, మత్తు పదార్థాలను వదిలి ప్రగతిశీల ఉద్యమాల వైపు అటువేయాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఐ (ఎం. ఎల్ ) మాస్ లైన్ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు వి.ప్రభాకర్, రాష్ట్ర కమిటీ సభ్యులు పి.రామకృష్ణ, డివిజన్ కార్యదర్శి బి.దేవారం,పీఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు వి.గోదావరి, డివిజన్ నాయకులు ఆర్.దామోదర్,బాబన్న,ఎం.లింబన్న,కె.రాంజీ, కిషోర్,జి.సాయరెడ్డి,ఈ రమేష్,ఎం.నరాగౌడ్,పి.రమ,ఆర్ పుష్పలత,ఎస్.కిశోర్,జె.బాల్ రెడ్డి, ఎస్.గంగామణి,ఎం. డి అనిస్, జె .ఎర్రన్న,కె.ఆశిస్, తదితరులు పాల్గొన్నారు.