- ఎస్సై అనిల్ రెడ్డి
కమ్మర్ పల్లి, బతుకమ్మ : దేశానికి పట్టుకొమ్మలైన యువత సన్మార్గంలో నడవాలని కమ్మర్ పల్లి ఎస్సై అనిల్ రెడ్డి అన్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి లో నిర్వహించనున్న బిగ్ బాస్ లీగ్ లో పాల్గొననున్న రక్షక్ పోలీస్ టీంకు పలువురు దాతలు క్రీడా దుస్తులను బుధవారం ఎస్సై ఆధ్వర్యంలో అందజేశారు. ఈ సందర్బంగా ఎస్సై మాట్లాడుతూ యువత మద్యం, డ్రగ్స్ కు అలవాటు పడకుండా క్రీడాలను అలవార్చుకోవాలని సూచించారు. రక్షక్ పోలీస్ క్రీడా టీం కు మండల కేంద్రానికి చెందిన టీవీఎస్ షో రూం ధరణి, పన్నాల రవి, యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ శైలందర్, గుండాజీ భారద్వాజ్ లు క్రీడ దుస్తులను అందజేయగా వారిని ఎస్సై అభినందించారు.