Batukammanews
Newspaper Banner
Date of Publish : 24 June 2025, 11:03 pm Posted by : ramakrishna

యువత సన్మార్గంలో నడవాలి

  • ఎస్సై మహేష్

 

భీమ్ గల్, బతుకమ్మ : దేశాభివృద్ధికి మూల స్థంబాలైన యువత డ్రగ్స్, గంజాయి, కల్తీ కల్లు, మాధక ద్రవ్యాలకు బానిసలు కాకుండా సన్మార్గం లో నడవాలని భీమ్ గల్ ఎస్సై మహేష్ సూచించారు. మంగళవారం మండల కేంద్రం లోని గవర్నమెంట్ జూనియర్ కాలేజీ లో డ్రగ్స్, గంజాయి సేవనం వల్ల కలిగే అనార్థల పై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్బంగా ఎస్సై మాట్లాడుతూ మానసిక స్థితి దెబ్బతినడం, మతిస్థిమితం కోలి పోవడం, చదువుపై ఆసక్తి తగ్గిపోవడం, కుటుంబ సంబంధాలు చెడిపోవడం, నేర కార్యకలాపాల్లో జారిపోవడం జరుగుతుందన్నారు. యువత మత్తు పదార్థాల జోలికి వెళ్ళి జీవితాలను నాశనం చేసుకోవద్దని, బంగారు భవిష్యత్తు ను పాడు చేసుకోవద్దన్నారు. ఎక్కడైనా డ్రగ్స్, గంజాయి, కల్తీ కల్లు అమ్మిన, వాడిని 1908 కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని, సమాచారం ఇచ్చిన వారి పేర్లు గొప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమం లో ఐసిడిఎస్ బృందం, కళాశాల ఉపాధ్యాయులు , విద్యార్థులు పాల్గొన్నారు.