Batukammanews
Newspaper Banner
Date of Publish : 10 January 2026, 8:50 pm Posted by : ramakrishna

సావిత్రిబాయి ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకోవాలి

. . . రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

నిజామాబాద్ జిల్లా బీసీ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఉద్యోగ ఉపాధ్యాయ పురస్కారాలు 2026 కార్యక్రమం శనివారం నగరంలోని న్యూ అంబేద్కర్ భవన్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి , బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళా విద్యకు మార్గదర్శకురాలైన సావిత్రిబాయి పూలే ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్య, ఆరోగ్యం, యువత నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తోందని గుర్తు చేశారు. 3 ఏళ్ల చిన్నారులకు పౌష్టికాహారం, ప్రీ-ప్రైమరీ స్కూళ్ల ఏర్పాటు, యువత కోసం స్కిల్ యూనివర్సిటీ, మహిళల కోసం మహిళా యూనివర్సిటీ ఏర్పాటు చేయడం ప్రభుత్వ సంకల్పమన్నారు. గేమ్స్, జోన్-స్థాయి టోర్నమెంట్ల ద్వారా యువతను ఆరోగ్యవంతంగా ఉంచే చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ బిల్లును అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపినా కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటోందని విమర్శించారు. ప్రభుత్వ స్కూళ్లు ప్రైవేటు స్కూళ్లకు పోటీగా నిలుస్తున్నాయని, పదో తరగతి ఫలితాల్లో శాతానికి శాతం ఉత్తీర్ణత రావడం గర్వకారణమని అన్నారు. మహిళలకు వడ్డీరహిత రుణాలు, ఉపాధ్యాయ నియామకాలు, గృహ నిర్మాణ పథకాలపై ప్రభుత్వ కట్టుబాటు కొనసాగుతోందని వెల్లడించారు. కార్యక్రమంలో బీసీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు మాడవేడి వినోద్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్షి రాఘవాపురం గోపాలకృష్ణ, అసోసియేటడ్ అధ్యక్షులు ఎ మోహన్, కార్యనిర్వాహక అధ్యక్షులు కొట్టాల రామ కృష్ణ బిసిటియు నాయకులు మహేందర్, విజయలక్ష్మి, స్వప్న, ప్రతభ, నరాల సుధాకర్, పీసీసీ డెలిగేట్ శేఖర్ గౌడ్, డీఈఓ అశోక్, మాజీ జెడ్పీ చైర్మన్ విట్టల్ రావు, కాంగ్రెస్ నాయకులు అగ్గు భోజన్న, రామచంద్ర గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

 

Youth should take Savitribai's ideals as an example