యువత వివేకానంద జీవనాన్ని అధ్యయనం చేయాలి
నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లెపూల జగన్ మోహన్ గౌడ్ నిజామాబాద్, బతుకమ్మ : స్వామి వివేకానంద జీవనాన్ని, సాహిత్యాన్ని నేటి యువత అధ్యయనం చేయాలని నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లెపూల జగన్ మోహన్ గౌడ్ అన్నారు. జిల్లాకోర్టు ప్రాంగణంలోని బార్ సమావేశపు హల్ లో ఆదివారం నిర్వహించిన స్వామి వివేకానంద జయంతి కార్యక్రమంలో ఆయన స్వామిజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం మాట్లాడారు. భారతీయ ఆధ్యాత్మిక, సాంస్కృతిని విశ్వవ్యాప్తం చేసిన మహనీయుడని తెలిపారు. స్వామిజీ స్వరూపమే ఒక సందేశమని, ఆయన...