Batukammanews
Newspaper Banner
Date of Publish : 21 March 2025, 7:06 pm Posted by : ramakrishna

యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి

  • ఎక్సైజ్ సీఐ యాదగిరి రెడ్డి

 

బాన్సువాడ,  బతుకమ్మ : యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని బాన్సువాడ ఎక్సైజ్ సీఐ యాదగిరి రెడ్డి సూచించారు.బాన్సువాడ పట్టణంలోని ఎస్ఎస్ఎల్ డిగ్రీ కళాశాలలో నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన సదస్సు నిర్వహించారు.గంజాయి కొకైన్, హెరాయిన్, ఆల్కహాల్, సిగరెట్ వంటి వాటికి యువత ఆకర్షితులై బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, ఉన్నత లక్ష్యాల వైపు అడుగు వేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఎన్వైకేఎస్ వాలంటీర్ సునీల్ రాథోడ్, కళాశాల ప్రిన్సిపాల్ సుభాష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.