. . . అనుమతి లేని స్థలాల్లో మద్యం సేవిస్తే కఠిన చర్యలు
. . . ఉమ్మడి జిల్లాలో ప్రత్యేక టీంలు
. . . ఎక్సైజ్ డిప్యూటి కమీషనర్ సొమిరెడ్డి
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :
నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో నూతన సంవత్సర వేడుకల సంధర్బంగా యువత డ్రగ్స్, గంజాయికి దూరంగా ఉండాలని నిజామాబాద్ ఎక్సైజ్ డిప్యూటి కమీషనర్ సొమిరెడ్డి తెలిపారు. అనుమతి లేని ప్లేస్ లలో, పబ్లిక్ ప్లేస్లలో మద్యం సేవిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పంక్షన్ హల్స్ లలో, హోటల్ లలో, ఈవేంట్ లలో ఖచ్చితంగా ఎక్సైజ్ శాఖ అనుమతి తీసుకోవాలని కొరారు. ఇతర రాష్ర్టాల మద్యం తీసుకురావద్ధని తెలిపారు. కొత్త సంవత్సర వేడుకల సంధర్బంగా ఉమ్మడి జిల్లాలో 8 ప్రత్యేక టింలను ఎర్పాటు చేసినట్లు, కేసులలో పట్టుబడితే కఠీన చర్యలు తీసుకుంటామని డిసీ తెలిపారు. ఉమ్మడి జిల్లాల ఇఎస్ లతో పాటు ఇన్స్ పెక్టర్ లు, ఎన్ పోర్స్ మెంట్ టీంలు సమన్వయంతో పని చేస్తాయని తెలిపారు.