Batukammanews
Newspaper Banner
Date of Publish : 13 August 2025, 3:44 pm Posted by : ramakrishna

మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలి

  • జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

 

కామారెడ్డి, బతుకమ్మ : విద్యార్థులు మాదక ద్రవ్యాలకు అలవాటు పడకుండా తమ భవిష్యత్ లో సక్రమమైన దారిలో నిర్మిచుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. మహిళలు, పిల్లలు వికలాంగుల,  వయోవ్రద్దుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మారక ద్రవ్య దుర్వినియోగం” యొక్క దుష్ప్రభావాలగురించి, సామూహిక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని బుధవారం పట్టణంలోని ప్రభుత్వ ఆర్ట్స్, సైన్స్ డిగ్రీ కాలేజీలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య ఆతిధిగా హాజరైన జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ విద్యార్థులతో కలిసి ప్రతిజ్ఞ చేశారు. అనంతరం మాట్లాడుతూ చాలా మంది యువకులు మాధక ద్రవ్యాలకు అలవాటు పడి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని తెలిపారు.  తెలంగాణ ప్రభుత్వం మాధక ద్రవ్యాలను వినియోగం కట్టడి చేయడం కొసం అనేక కార్యక్రమాలను నిర్వహిస్తుందని అన్నారు. జిల్లాలో మాధక ద్రవ్యాలను వినియోగం తగ్గించడానికి జిల్లా సంక్షేమ శాఖ, ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్  విజయ్, జిల్లా సంక్షేమ ఆధికారి ప్రమీల, ఎక్సైజ్ సూపరిండెంట్  హనుమంత రావు,  డిగ్రీ కళాశాల విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

Youth should stay away from drugs.