యువత గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలి
లింగంపేట్, బతుకమ్మ : మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన గ్రంథాలయాలను యువకులు సద్వినియోగం చేసుకోవాలని మండల విద్యాశాఖ అధికారి రామస్వామి సూచించారు. "ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక" లో భాగంగా పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న "విద్య వారోత్సవాలలో" భాగంగా శుక్రవారం మండల విద్యాశాఖ అధికారి రామస్వామి తాడ్వాయి మండల కేంద్రంలోని లైబ్రరీని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక పుస్తకం 100 మంది స్నేహితులతో సమానమన్నారు. పుస్తక పఠనం వల్ల ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, సహనం వస్తుందని తెలియజేశారు....