Batukammanews
Newspaper Banner
Date of Publish : 16 April 2025, 7:18 pm Posted by : ramakrishna

యువత క్రీడలతో పాటు అన్నిరంగాల్లో రాణించాలి

ఎమ్మెల్యే ప్రొద్దుటూరి సుదర్శన్ రెడ్డి

 

బతుకమ్మ, బోధన్: యువత క్రీడలతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని ఎమ్మెల్యే ప్రొద్దుటూరి సుదర్శన్ రెడ్డి అన్నారు. బోధన్ మండలం లోని పెగడపల్లి గ్రామంలో సీజన్ 2, పిపిఎల్ పెగడపల్లి ప్రీమియర్ లీ క్రికెట్ టోర్నమెంట్ ఏప్రిల్ 1న ప్రారంభమై ఏప్రిల్ 16న ముగిసింది. ఈ ఈ సీజన్ పిపిఎల్ క్రికెట్ టోర్నమెంట్లో సుమారుగా  జిల్లా లోని సుమారుగా 40 జట్లు పాల్గొనగా బుధవారం ఫైనల్ పోరులో పెగడపల్లి, పెంటాకలన్ గ్రామాల టీంలు పోటీ పడగా పెంటాకలాన్ మొదటి విజేతగా నిలువగా రన్నరప్ గా  పెగడపల్లి టీం నిలిచింది. వీరికి నగదును ట్రోఫీని అందజేయడానికి మాజీ మంత్రి బోధన్ శాసనసభ్యులు ప్రొద్దుటూరు సుదర్శన్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి పోటీదారులకు బహుమతులను ప్రదానం చేశారు. విజేతకు 25,555/-  నగదు ట్రోపీ, రన్నరప్ కు 12,222/- నగదును ట్రోఫీని, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ తదితర బహుమతులను క్రీడాకారులకు మెమెంటోలను బహుకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ నేటి యువత ఆన్లైన్ బారిన పడకుండా ఇలాంటి క్రీడా పోటీలను ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయమని ఈ క్రీడల వల్ల శారీరక మానసిక దారుణ్యాలను పెంపొందించడమే కాక జీవనశైలికి ఎంతో తోడ్పడతాయని, యువత  క్రీడలలోనే కాకుండా విద్యపై కూడా ప్రత్యేక దృష్టి సాధించాలని ఉన్నత విద్యలను అభ్యసించి ఉద్యోగాలలో స్థిరపడాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యోగాల కొరకై నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నామని, యువత పెడదారి పట్టకుండా ఉద్యోగం చేసుకొని ఒక స్థిర జీవితాన్ని ఏర్పాటు చేసుకోవడం కొరకు ఈ అవకాశాల్ని కల్పిస్తున్నామని దీనిని ప్రతి ఒక్కరు సద్వినియోగపరుచుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సహకార సంఘాల యూనియన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతీ రెడ్డి రాజిరెడ్డి, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యులు కడుగు గంగాధర్ డిపిసిసి డెలికేట్ గంగా శంకర్, సీనియర్ నాయకులు నాగేశ్వరరావు, నరేందర్ బోధన్ ఏఎంసీ ఇంచార్జ్ చైర్మన్ చీల శంకర్, బోధన్ మండల తహసిల్దార్ విటల్, రూరల్ ఎస్సై మచ్చేందర్ రెడ్డి, పెగడపల్లి గ్రామ ప్రముఖ నాయకులు, పి పి ఎల్ నిర్వాహక కమిటీ సభ్యులు, యువత తదితరులు పాల్గొన్నారు.

Youth should excel in all fields, including sports.14253