Batukammanews
Newspaper Banner
Date of Publish : 17 January 2026, 7:51 pm Posted by : ramakrishna

యువత రహదారి భద్రతకు ఆదర్శంగా నిలవాలి

మద్నూర్ బతుకమ్మ:

 

రహదారి భద్రత మాసోత్సవాలు పురస్కరించుకొని మద్నూర్ లో నిర్వహించిన కార్యక్రమం లో డ్రైవర్స్ ను ఉద్దేశించి రవాణా శాఖ అధికారులు  రహదారి భద్రతపై అవగాహన కల్పిస్తూ కీలక సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సహాయక మోటార్ వాహనాల ఇన్స్పెక్టర్ శంకర్ మాట్లాడుతూ, యువత రహదారి భద్రతకు మార్గదర్శకులుగా నిలవాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ వాహనంపై ప్రయాణించే సమయంలో తప్పనిసరిగా సరిఅయిన ధ్రువపత్రాలు కలిగి ఉండాలి అని, మద్యం సేవించి వాహనం నడపడం వల్ల ప్రాణాపాయాలు ఏర్పడతాయని హెచ్చరించారు. రహదారి నియమాలు పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని డ్రైవర్స్ ను ఉద్దేశించి వివరించారు. ఈ కార్యక్రమంలో సహాయక మోటార్ వాహనాల ఇన్స్పెక్టర్ రఫీ పాల్గొన్నారు.