. . . మొత్తం ఆరు నేరాలలో పదివేల చొప్పున జరిమానాలు విధింపు
. . . బాలికకు ఐదు లక్షల రూపాయల ఆర్థిక పరిహారానికి జిల్లా న్యాయసేవ అధికార సంస్థకు సిపార్సు
. . . నిజామాబాద్ జిల్లా ప్రత్రేక పోక్సో కోర్టు స్పెషల్ సెషన్స్ జడ్జి దారావత్ దుర్గా ప్రసాద్ తీర్పు
నిజామాబాద్ లీగల్, బతుకమ్మ :
పట్టుమని పన్నెండేళ్లు నిండని పసిబాలిక గృహ అవసరాల కోసం ఇంటినుండి అప్పుడప్పుడు కిరాణ దుకాణంకు వచ్చిపోయేది.అప్పుడే ఒక మగమృగం కన్నుపడింది. ఆ బాలికను రాత్రివేళ సమయంలో కిరాణ షాపుకు బాలిక వచ్చే మధ్యదారిలో మాయమాటలు జెప్పి దగ్గరలో నిర్మాణంలో ఉన్న భవనంలోకి తీసుకుని వెళ్లి భయం కొలిపే విదంగా బెదిరింపులు చేసి తీవ్రమైన లైంగిక దాడులు చేశాడు. ఒకసారి కాదు పలుమార్లు లైంగిక దాడులు.చివరికి కోర్టు విధించిన రెండు జీవిత కారాగార శిక్షలకు గురై నిజామాబాద్ జిల్లా కేంద్ర కారాగారానికి చేరిన ఒక కామపిషాచుడి కథ.ఎంత బలవంతుడైన చట్టం ముందు బాలాదూర్ అని చట్టం నుండి తప్పించుకోలేడని చెప్పిన కోర్టుతీర్పు.
కోర్టు వెలువరించిన 111 పేజీల తీర్పు వివరాలలోకి…
పన్నెండు సంవత్సరాల బాలికపై పలుమార్లు అత్యాచారం చేసిన షేక్ ఏజాజ్ (20) కు రెండు అత్యాచారాల నేరాలో రెండు జీవిత కారాగార శిక్షలు విదిస్తూ నిజామాబాద్ జిల్లా ప్రత్యేక పోక్సో కోర్టు స్పెషల్ సెషన్స్ జడ్జి దారావత్ దుర్గా ప్రసాద్ గురువారం తీర్పు చెప్పారు . నేరపూరిత బెదిరింపులకుగాను రెండేళ్లు, పోక్సో చట్టంలో పేర్కొన్న మూడు నేరాలకుగాను పన్నెండు సంవత్సరాల చొప్పున కఠిన కారాగార శిక్షలు విదిస్తున్నట్లు తీర్పులో పేర్కొన్నారు. మొత్తం ఆరు నేరాల్లో పదివేల చొప్పున మొత్తం అరవై వేల రూపాయల జరిమానాలు కూడా విధించారు.నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్ కు చెందిన షేక్ ఏజాజ్ బోధన్ రోడ్ లో ఉన్న ఒక కాలోని పన్నెండు సంవత్సరాల బాలిక తన తన గృహ అవసరాల కోసమని కిరాణ దుకాణంకు వచ్చివెళ్ళేది గమనించాడు. ఆ బాలికపై అత్యాచారం చేసి లైంగిక వాంఛ తీర్చుకోవాలనే దుష్ట ఆలోచనలు చేశాడు.ఒకరోజు రాత్రి సమయంలో ఒంటరిగా కిరాణ షాపుకు వచ్చి వెళుతున్న బాలికకు మాయమాటలు చెప్పి దగ్గరలో నిర్మాణంలో ఉన్న ఇంటిలోకి తీసుకుని వెళ్లి నేరపూరిత బెదిరింపులు చేసి పసిపాపపై లైంగిక దాడి జరిపాడు. మీ ఇంటిలో ఎవరికైనా చెపితే చంపివేస్తానని బెదిరించి, నిన్ను అత్యాచారం చేసిన ఫొటోలు, వీడియో సెల్ ఫోన్ లో ఉన్నాయి వాటిని ఇతరుల ఫోన్ లలోకి పంపించి ప్రచారం చేస్తానని బెదిరింపులు చేశాడు.బాలిక బలహీనతను ఆసరా చేసుకుని 2021 సంవత్సరంలో పలుమార్లు లైంగిక దాడులు చేశాడు. ఒకనాడు బాలిక తనకు కడుపు నొప్పి అని తల్లికి చెప్పడంతో ఆమె నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో డాక్టర్లకు చూయించింది.డాక్టర్లు మరోమారు రావాలని సూచనలు చేశారు. బాలిక తల్లి తనకు తెలిసిన ఇద్దరుముగ్గురు మెడికల్ ప్రాక్టీస్నర్లకు చూయించింది. అఖరుగా ఒక ప్రాక్టీస్నర్ స్కానింగ్ కు సిపార్సు చేసి రిపోర్టు తీసుకుని రావాలని కోరాడు. సదరు రిపోర్టులో బాలిక ఆరు నెలల గర్భవతిగా ఉన్నదని తేలడంతో ఆమె తన కూతురును ఇలా ఎలా అయిందంటూ అడగటంతో షేక్ ఏజాజ్ అనే వ్యక్తి తనను బెదిరించి, భయపెట్టి పలుమార్లు లైంగిక దాడులు చేసిన విషయం బయటపెట్టింది. ఆమె తన కూతురును వెంటబెట్టుకు వెళ్లి పోలీస్ స్టేషన్ హౌస్ అధికారికి పిర్యాదు చేసింది. పిర్యాదుననుసరించి సమగ్ర నేర విచారణ చేసిన పోలీసులు సాక్షుల వాంగ్మూలాలు, ముద్దాయి షేక్ ఏజాజ్ నేర ఒప్పుకోలు పంచానామా, పోరెన్సిక్ రిపోర్ట్, డిఎన్ఎ రిపోర్ట్, బాలిక ప్రసవానంతరం జన్మనిచ్చిన ఆ తరువాత రెండురోజులకే మృతి చెందిన మృతశిశువు డిఎన్ఎ రిపోర్ట్ తో కూడిన చార్జీషీట్ ను కోర్టులో సమర్పించారు.(బాలిక ఆరు నెలల గర్భవతిగా ఉన్నందున అబార్శన్ చేయడం మూలంగా బాలిక మృతి చెందే అవకాశం ఉన్నదనే డాక్టర్ల సలహా మేరకు తొమ్మిది నెలల అనంతరం బాలిక ప్రసవించింది )అభియోగ పత్రం అదారంగా నేర న్యాయ విచారణ నిర్వహించిన పోక్సో స్పెషల్ జడ్జి దుర్గా ప్రసాద్ మొత్తం పదిహేను మంది సాక్షుల సాక్ష్యాలను నమోదు చేసుకుని, పద్నాల్గు ధ్రువీకరించుకున్న పత్రాలు మార్క్ చేసి మరొక వస్తుగత సాక్ష్యాన్ని పరిగణలోకి తీసుకుని, పోరెన్సిక్ రిపోర్ట్, డిఎన్ఎ రిపోర్ట్,ఇవన్ని అధ్యయనం చేసిన జడ్జి దుర్గా ప్రసాద్ ముద్దాయి షేక్ ఏజాజ్ పై నేర అభియోగాలు రుజువు అయినట్లు తీర్పు చెప్పారు.ఇండియన్ పినల్ కోడ్ సెక్షన్ 376(ఎ బి ) పన్నెండు సంవత్సరాల బాలికపై అత్యాచారం చేసిన నేరానికి గాను జీవిత కారాగార శిక్ష, సెక్షన్ 376 (2)(ఎన్ ) పదే పదే అత్యాచారం చేసిన నేరంకుగాను జీవిత కారాగార శిక్ష, సెక్షన్ 506 నేర పూరిత బెదిరింపులు నేరంకుగాను రెండు సంవత్సరాల కఠిన కారాగార శిక్షలు విధించారు.పోక్సో చట్టంలోని సెక్షన్ 5 (ఎల్ ) పన్నెండు సంవత్సరాల బాలికపై అత్యాచారం నేరంకుగాను పన్నెండు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, సెక్షన్ 5 బాలికను గర్భవతిని చేసి అత్యాచారం నేరంకుగాను పన్నెండు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, సెక్షన్ 5 (ఎమ్ ) పన్నెండు సంవత్సరాల బాలికను లైంగిక దాడి చేసిన నేరంకుగాను పన్నెండు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష లు విదిస్తూన్నట్లు న్యాయమూర్తి దుర్గా ప్రసాద్ తమ తీర్పులో తెలిపారు. ఆరు శిక్షలలో పదివేల చొప్పున మొత్తం అరవై వేలు జరిమానా విధించారు. జరిమానా చెల్లించని యెడల అదనంగా ఆరు నెలల చొప్పున జైలుశిక్షలు అనుభవించాలన్నారు.శిక్షలన్నీ ఏకకాలంలో అనుభవించాలని తీర్పులో పేర్కొన్నారు.అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ నరసింహ రెడ్డి పోలీసుల తరపున ప్రాసిక్యూషన్ నిర్వహించారు.
-బాధిత బాలికకు ఐదు లక్షల రూపాయల పరిహారానికై నిజామాబాద్ జిల్లా న్యాయసేవ సంస్థకు సిపార్సు
తీవ్రమైన శరీరక, మానసిక హింసలకు, లైంగిక దాడులకు గురైన బాలికకు ఐదు లక్షల రూపాయల పరిహారం నిజామాబాద్ జిల్లా న్యాయసేవ సంస్థ అందజేయడానికి న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని జడ్జి దుర్గా ప్రసాద్ తమ తీర్పులో సిపార్సు చేశారు.