Batukammanews
Newspaper Banner
Date of Publish : 23 August 2025, 5:04 pm Posted by : ramakrishna

యూత్ సభ్యులకు ఇనుప స్టాండ్ అందజేత

బతుకమ్మ, ఏర్గట్ల: మండలం కేంద్రములో యువజన సంఘాల యూత్ సభ్యులు వినాయక మండపాల షెడ్లు నిర్మాణం చేపట్టుటకు 17 ఫీట్ల ఇనుప స్టాండ్ అవసరం ఉన్నదని జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు శివన్నోళ్ళ శివకుమార్ దృష్టికి తీసుకు వెళ్లడంతో వినాయక మండపాలకు 17 ఫీట్ల పెద్ద స్టాండ్ అవసరాన్ని గ్రహించి సభ్యుల కోరిక మేరకు ఏర్గట్ల గ్రామములోని అన్ని యూత్ లు వాడుకోవటానికి శివన్నోళ్ళ శివకుమార్ యూత్ సభ్యులకు అందజేయడం జరిగింది.ఇట్టి సందర్భంలో శివన్నోళ్ళ శివకుమార్ మాట్లాడుతూ గ్రామములో ఎవరికైనా ఇనుప స్టాండ్ అవసరం ఉన్నచో గ్రామంలోని రాయల్ గాయ్స్ యూత్ సభ్యులను కలవాలని, అవసరం బట్టి 17 ఫీట్ల ఇనుప స్టాండ్ ను తీసుకోని వెళ్లి ఉచితంగానే వాడుకొని యూత్ సభ్యుల వారికి అప్పచెప్పాలని  అన్నారు.యూత్ సభ్యులు మాట్లాడుతూ అడగగానే ఇనుప స్టాండ్ ను ఉచితంగా అందజేసిన శివన్నోళ్ళ శివకుమార్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపి సన్మానం చేయడం జరిగింది.ఇట్టి కార్యక్రమములో ఆదర్శ యూత్,సహృదయ యూత్,రాయల్ గయ్స్ యూత్,యంగ్ ఫైర్స్ యూత్,శివాజీ గయ్స్ యూత్, వి కింగ్స్ యూత్,రాయల్ ఫ్రెండ్స్ యూత్ సభ్యులు పాల్గొన్నారు.