ఇందల్వాయి, బతుకమ్మ : ఇందల్వాయి మండల కేంద్రంలోని ఇందల్వాయి గ్రామంలో శనివారం రాత్రి శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా గోపాల కల్వ నిర్వహించారు. సుమారు మూడున్నర గంటల పాటు ఉట్టి కొట్టడానికి గ్రామస్తులు ఒకరిపై ఒకరు పోటి పడగా ఎస్సీ అంబేద్కర్ కాలానికి చెందిన కమ్మరి శ్రావణ్ ఉట్టి కొట్టడం జరిగింది.దీంతో ఆ యువకుడికి ఆదివారం ఉదయం శ్రీ లక్ష్మీనరసింహస్వామి మందిరం వద్ద యువతరం యూత్ సభ్యులు ఘనంగా శాల్వా పూలమాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో జెగ్గ ప్రవీణ్ కుమార్ డీలర్, ఉండ్రుగు నవీన్,జెగ్గ నవీన్,తొగరి గణేష్,మద్దెల గణేష్,సున్నం ధర్మపురి,సిద్దార్థ,జెగ్గ రణదీప్,ఆలయ పూజారి కమ్మరి జానీ తదితరులు పాల్గొన్నారు.