ఆమ్ ఆద్మీ పార్టీలో యువత చేరిక

బతుకమ్మ, నిజామాబాద్ రూరల్ : నిజామాబాద్ రూరల్ మండలం గుప్పన్‌పల్లి గ్రామంలో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు సమీర్ అహ్మద్ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన పలువురు యువకులు స్వచ్ఛందంగా పార్టీలో చేరారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు సమీర్ అహ్మద్ మాట్లాడుతూ, సమాజంలో పేరుకుపోయిన అవినీతి, అక్రమాలను రూపుమాపడానికి యువత రాజకీయాల్లోకి చురుకుగా రావాలని పిలుపునిచ్చారు. "రాజకీయం అంటే అధికారం కాదు, అది ప్రజలకు నిస్వార్థంగా సేవ చేసే ఒక మార్గం," అని...