Batukammanews
Newspaper Banner
Date of Publish : 30 November 2025, 6:23 pm Posted by : ramakrishna

ఆమ్ ఆద్మీ పార్టీలో యువత చేరిక

బతుకమ్మ, నిజామాబాద్ రూరల్ : నిజామాబాద్ రూరల్ మండలం గుప్పన్‌పల్లి గ్రామంలో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు సమీర్ అహ్మద్ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన పలువురు యువకులు స్వచ్ఛందంగా పార్టీలో చేరారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు సమీర్ అహ్మద్ మాట్లాడుతూ, సమాజంలో పేరుకుపోయిన అవినీతి, అక్రమాలను రూపుమాపడానికి యువత రాజకీయాల్లోకి చురుకుగా రావాలని పిలుపునిచ్చారు. “రాజకీయం అంటే అధికారం కాదు, అది ప్రజలకు నిస్వార్థంగా సేవ చేసే ఒక మార్గం,” అని ఆయన స్పష్టం చేశారు. కేవలం ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రమే దేశంలో పారదర్శకమైన, నిజాయితీతో కూడిన పాలనను అందించగలదని ఆయన పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ రూరల్ మండలం మైనారిటీ విభాగం ఇన్‌చార్జిగా ముక్తార్‌ బైగ్ ను నియమిస్తున్నట్లు సమీర్ అహ్మద్ అధికారికంగా ప్రకటించారు. పార్టీ బలోపేతానికి, మైనారిటీల సమస్యల పరిష్కారానికి అంకితభావంతో కృషి చేస్తానని ముక్తార్ బైగ్ ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనారిటీ అధ్యక్షులు హజార్ ఉద్దీన్, షేక్ ఆసిఫ్, సయ్యద్ కరీం, మనోజ్, మీర్జా జుబేర్ తదితరులు పాల్గొన్నారు.