Batukammanews
Newspaper Banner
Date of Publish : 17 May 2025, 8:01 pm Posted by : ramakrishna

వక్ఫ్ బోర్డు బిల్లుకు వ్యతిరేకంగా గళమెత్తిన యూత్ జేఎసీ

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వక్ఫ్ బోర్డు బిల్లును వెనక్కి తీసుకోవాలని యూత్ జాయింట్ యాక్షన్ కమిటీ నిజామాబాద్ గళమెత్తింది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్ వద్ద శనివారం సాయంత్రం యూత్ జేఎసీ అధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఇండియా రిజెక్ట్ వక్ఫ్ అమెండమెంట్ యాక్ట్ అంటు ప్లకార్డులు ప్రదర్శించారు. ఆజాది అంటు నినాదాలు చేశారు. హమ్ ఏక్ హై ఆజాది అంటు నినాదాలు చేశారు. పార్టీలకు అతీతంగా యువకులు వారికి  మద్దతు పలికారు.

Youth JAC raises voice against Waqf Board Bill